‘పెద్ది’ వివాదం.. అనసూయ పోస్టు వైరల్

ప్రతిపక్షం, జూన్ 06: ‘పెద్ది’ చిత్రంలో కథానాయిక పాత్ర చిత్రణపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నటి అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సినిమా అనేది కల్పిత కథ అని, మంచి-చెడులను గుర్తించే విచక్షణ ప్రేక్షకులకు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం సరైన అభిప్రాయం కాదన్నారు.

దర్శకులు, రచయితలకు తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు ఉండాలని, అదే సమయంలో సమాజం పట్ల బాధ్యత కూడా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సృజనకర్తలు వినోదంతో పాటు బాధ్యతాయుతమైన కథాంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News