అన్ని హంగులతో రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతమైన కార్యాలయాన్ని నిర్మిస్తాం

•సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి.నిరంజన్ రెడ్డి సన్మానించిన డాక్యుమెంట్ రైటర్స్

ప్రతిపక్షం, జూన్ 08, వనపర్తి ప్రతినిధి: మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన వ్యక్తిగత పని మీద సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా సబ్ రిజిస్టార్ చంద్రశేఖర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కార్యాలయ పనితీరు గూర్చి వివరించారు.ఇంకా కొన్ని మౌలిక వసతులు అందుబాటులోకి రావాలని వివరించారు.రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ ఆధ్వర్యoలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హంగులతో రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతమైన కార్యాలయాన్ని నిర్మిస్తామని అన్నారు.కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రైటర్స్ మరియు వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.నిరంజన్ రెడ్డి వెంట కూతురు తేజస్విని,నాయకులు వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్,సయ్యద్.జహంగీర్,బాగ్యరాజ్,అరుణ్ యాదవ్,ఇమ్రాన్,ముని కుమార్,అలీమ్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News