విడాకుల కేసు.. డబ్బు లేకపోవడంతో భర్త ఆత్మహత్య

ప్రతిపక్షం, జూన్ 08: హైదరాబాద్ నగర పరిధిలోని మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైవాహిక విభేదాలు, ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

చెంగిచెర్ల ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల యువకుడు 2024లో వివాహం చేసుకున్నాడు. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య న్యాయపరమైన వ్యవహారాలు కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది.

విడాకుల ప్రక్రియలో భాగంగా అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అవి ఫలించకపోవడంతో యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News