ప్రతిపక్షం, జూన్ 08: హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐడీపీఎల్ టౌన్‌షిప్‌లోని శివాలయంలో పూజారిగా సేవలందిస్తున్న కొండూరి కిషోర్ శర్మ (42) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మూడు నెలలుగా పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. తిరిగి కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్ శర్మ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను సేకరిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
















