2ఏళ్లలో ₹1.10 లక్షల కోట్లకుపైగా ఆస్తులు కాపాడిన హైడ్రా: కమిషనర్ రంగనాథ్

ప్రతిపక్షం, జూన్ 08: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గత రెండేళ్లలో రూ.1.10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రజా ఆస్తులను పరిరక్షించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడి పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా ఆస్తుల సంరక్షణలో హైడ్రా చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు.

ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, మరో ఏడాదిలో పరిరక్షించిన ఆస్తుల విలువ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రజలకు, మీడియాకు రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ఆస్తుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News