హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 09: మల్కాజిగిరి పరిధిలో 2019లో జరిగిన రైల్వే ఉద్యోగి మారుతి సుతార్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెన్షన్ ప్రయోజనాల కోసం తండ్రికి విషమిచ్చి హత్య చేసినట్లు తేలడంతో కుమారుడు, కుమార్తెకు ఉరిశిక్ష విధించింది.
ఈ కేసులో నిందితురాలైన మృతుడి భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. హత్య అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ముక్కలు చేసి ఆనవాళ్లు చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది.
అత్యంత క్రూరంగా జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితులపై కఠిన శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది.

















