రేవంత్ రెడ్డి Vs కిషన్ రెడ్డి.. వేడెక్కిన రాజకీయం

ప్రతిపక్షం, జూన్ 09: తెలంగాణ రాజకీయాల్లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరింది. ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర సహకారం, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు.

రాష్ట్ర రైతుల ధాన్యం కొనుగోళ్లు, ప్రాజెక్టులకు కేంద్రం సహకరించకపోతే కిషన్ రెడ్డి తెలంగాణ పొలిమేర కూడా దాటలేరని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దీనికి స్పందించిన కిషన్ రెడ్డి, తనను ఆపే వ్యక్తి తెలంగాణలో పుట్టలేదని కౌంటర్ ఇచ్చారు.

అలాగే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పట్టిన రాజకీయ గతే రేవంత్ రెడ్డికీ పడుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందించిన రేవంత్, కిషన్ రెడ్డి బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కిషన్ రెడ్డిని ఉద్దేశించి “పంచాయితీ పెట్టించే లడాయి కోతి” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు కొనసాగుతుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

Spread the love

Related News

Latest News