ఐటీ విప్లవానికి కాంగ్రెస్‌నే పునాది.. మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 09: సైబరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి మూడు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం బీజం వేసిందని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 1992లో నాటి ప్రధాని పి.వి. నరసింహారావు నాయకత్వంలో ఐటీ రంగ విస్తరణకు పునాది పడిందని గుర్తుచేశారు.

సీఎం ఎ. రేవంత్ రెడ్డితో కలిసి సీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గత రెండేళ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు పైగా పెంచినట్లు వెల్లడించిన ఆయన, కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాల సృష్టికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటూ, రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News