ప్లాస్టిక్ వ్యర్థాలకు కొత్త రూపం.. రీసైక్లింగ్ ఉత్పత్తులను ప్రశంసించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూన్ 09: వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వినూత్నంగా వినియోగిస్తూ తయారు చేసిన పర్యావరణహిత ఉత్పత్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రీసైక్లింగ్ ద్వారా తయారైన కండువా, చొక్కాను సీఎం ప్రదర్శించారు.

ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను పునర్వినియోగం చేసి వస్త్రాలుగా మార్చడం పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ విలువైన ఉత్పత్తులు తయారు చేయడం అభినందనీయమని అన్నారు.

ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన కుర్చీలు, ఇతర ఉత్పత్తులను కూడా సీఎం పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణలో ఇలాంటి సృజనాత్మక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంలో రీసైక్లింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి ప్రయత్నాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News