హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 09: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు మహిళాశక్తి మహాసభ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎ. రేవంత్ రెడ్డి, దనసరి సీతక్క హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించనుంది. అలాగే వడ్డీలేని రుణాల పథకం కింద మహిళా సంఘాలకు రూ.500 కోట్ల విలువైన చెక్కులను అందజేయనున్నారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రోత్సాహంగా మహిళా సంఘాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చిన 553 బస్సులను కూడా సీఎం ప్రారంభించనున్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల విస్తరణ, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ మహాసభ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

















