ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీలో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే.అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ నేత, మండలిలో చీఫ్‌ విప్‌ మేరిగ మురళీధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు.

Spread the love

Related News

Latest News