ప్రతిపక్షం, జూన్ 11: దేశంలో సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వ విధానాల భారం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు, ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఏఐసీసీ సమావేశంలో జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించినట్లు తెలిపారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, రాజకీయ కక్షతోనే ఆమె రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. మహిళా నాయకురాలిపై ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
దేశ చరిత్రలో అరుదుగా జరిగే ఈ ఘటన బీజేపీ రాజకీయ వైఖరికి నిదర్శనమని, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరమని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

















