ప్రతిపక్షం, జూన్ 11: ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ కోసం తాను కూడా 17 ఎకరాల భూమి ఇచ్చానని, ఆ భూములను రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగిస్తే సహించబోమన్నారు. అధికారంలోకి రావడానికి రైతులకు భూములు తిరిగి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
ఫార్మాసిటీ భూములను రైతులకు వెనక్కి ఇవ్వాలని, లేదంటే ఫార్మాసిటీ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ లేదని ప్రకటించడంతో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

















