లీగల్ నోటీసులతో కేసు ఉన్నట్లు కాదు: మీనాక్షి

ప్రతిపక్షం, జూన్ 12: రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించారని కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఫారం-26లో అవసరమైన అన్ని వివరాలను వెల్లడించానని చెప్పారు. ప్రైవేట్ ఫిర్యాదులకు సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఫారంలో లేదని పేర్కొన్నారు. కేవలం లీగల్ నోటీసులు అందినంత మాత్రాన కేసు నమోదైనట్లు కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా, నామినేషన్ తిరస్కరణ అంశంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవనున్నారు.

Spread the love

Related News

Latest News