ప్రతిపక్షం, జూన్ 12: హరియాణాలో ఓ మహిళా జడ్జి హనీట్రాప్కు గురై రూ.52 లక్షలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. టిండర్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి దశలవారీగా ఆమె నుంచి డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన విషయం బయటపడితే పరువు పోతుందనే భయంతో తన పనిమనిషి పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అయితే దర్యాప్తులో అసలు బాధితురాలు మహిళా జడ్జేనని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, అతడికి బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం కేసుపై సమగ్ర విచారణకు ఆదేశించింది.

















