ప్రతిపక్షం, జూన్ 11: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో బీజేపీ నేతల పాత్ర ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. తనపై ఉన్న కేసుల గురించి మీనాక్షి నటరాజన్‌కు తెలియదా అని ప్రశ్నించిన ఆయన, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అంతర్గత కుట్ర కోణాన్ని పరిశీలించుకోవాలని సూచించారు.
‘మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన సమాచారం రేవంత్ రెడ్డే చాటుగా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇది కాంగ్రెస్ కుట్రనా, లేక పొట్టోడి కుట్రనా అన్నది ఆ పార్టీ తేల్చుకోవాలి’ అని అర్వింద్ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు ‘పొట్టోడు’ అంటే ఎవరని ప్రశ్నించగా, సీఎం రేవంత్ రెడ్డినే ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేసినట్లు స్పష్టం చేశారు.

















