చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించిన కేటీఆర్

ప్రతిపక్షం, జూన్ 04: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్‌గూడ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించి ములాఖత్ అయ్యారు.

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు జైలుకు చేరుకున్నారు. బాల్క సుమన్ ఆరోగ్య పరిస్థితి, కేసుకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా చంచల్‌గూడ జైలు పరిసరాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

Spread the love

Related News

Latest News