పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవడం నా బాధ్యతగా భావిస్తున్నాను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి.

ప్రతి పక్షం, నల్గొండ జూన్ 4: ఫిజియోథెరపీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని, తదుపరి చదువుల కోసం వచ్చిన ఒక చెల్లెమ్మకు మూడో సంవత్సరం ఫీజును కూడా వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ బిడ్డ ముఖంలో చూసిన సంతోషం నాకెంతో తృప్తినిచ్చింది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనేదే నా సంకల్పం. విద్యావంతుడైన ప్రతి బిడ్డ ఈ సమాజానికి ఒక ఆస్తి. భవిష్యత్తులో కూడా విద్యార్థుల ఉన్నత చదువులకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పారు.

Spread the love

Related News

Latest News