[t4b-ticker]

కాలుష్యం వెదజళుతున్న MS అగర్వాల్ పరిశ్రమపై చర్య తీసుకోవాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 03: MS అగర్వాల్ పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతుందని గ్రామస్తులు పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చిన చర్యలు తీసుకోవడం లేదని వెంటనే పారిశ్రమను మూసి వేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కే నర్సమ్మ. తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్ మండలం రంగయిపల్లి గ్రామంలో ఉన్న MS అగర్వాల్ పరిశ్రమ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పరిశ్రమ 2006 నుండి పరిశ్రమలో ఉత్పత్తులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 3 సార్లు పరిశ్రమను విస్తృత పరిచరని తెలిపారు. పరిశ్రమ నుండి వెలవడుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయని వాటి వలన గ్రామంలోని ప్రజలకు చర్మ వ్యాదులు, శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని ఆమె అన్నారు. పరిశ్రమ వెదజల్లే దుమ్ము, దూళి వలన నల్లటి దుమ్ముతో ప్రజలు తీవ్ర అనారోగ్యనికి గురవుతున్నారని తెలిపారు.

భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వలన రద్దీ తీవ్రంగా ఉంటుందని, ప్రజలు రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్న పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. పరిశ్రమ ఉత్పత్తుల విస్తరణ కోసం ప్లాంట్ను ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనను యాజమాన్యం విరామించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు చేసిన ప్రజా అభిప్రాయ సేకరకనాలో గ్రామ ప్రజలు వ్యతిరేకించరని, ప్రజల అభిప్రాయంకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని అన్నారు. MS అగర్వాల్ పరిశ్రమతో గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కాలుష్యం వెదజల్లి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న MS అగర్వాల్ పరిశ్రమపై చర్యలు తీసుకునే వరకు గ్రామ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హేచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించే వరకు దశాల వారీగా ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు అభివృద్ధి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు A. మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ నాయకులు అజయ్ లు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News