[t4b-ticker]

భారత జట్టులో కలకలం.. గంభీర్‌పై సీనియర్ల ఫిర్యాదు?

ప్రతిపక్షం, ఆగస్టు 04: భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలపై చర్చ జరుగుతోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ విధానంపై కొందరు సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమ అభ్యంతరాలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు అనధికారికంగా తెలియజేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

గంభీర్ నాయకత్వంలో ఆడేందుకు తాము అంతగా సుముఖంగా లేమని కొందరు సీనియర్ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే జట్టు ఓటములకు కోచ్ బాధ్యత తీసుకోకపోవడం బోర్డు వర్గాలకు కూడా అసంతృప్తి కలిగించిందని కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న శ్రీలంక పర్యటన గౌతమ్ గంభీర్‌కు కీలక పరీక్షగా మారే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు బీసీసీఐ లేదా గౌతమ్ గంభీర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Spread the love

Related News

Latest News