[t4b-ticker]

టిఆర్ఎస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుంది: మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ బట్టి అజయ్

సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 04: తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే కేవలం టిఆర్ఎస్ తోనే సాధ్యమని హైదరాబాద్లో జరిగే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ బట్టి అజయ్ తెలిపారు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీ మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం జరగలేదని సమాన అవకాశాలు రాలేదని ఆయన తెలిపారు సామాజిక న్యాయం ద్వారా మాత్రమే సిద్ధిస్తుందని భారత రాష్ట్ర సమితి గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని సామాజిక న్యాయం చేయడంలో విఫలం చెందారని ఆయన తెలిపారు.తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’ నిర్వహిస్తున్నాం.

ఈ మహాసభ ప్రజల ఆకాంక్షలకు కొత్త దిశను చూపించే చారిత్రాత్మక సభగా నిలవనుంది” అని అన్నారు. ఆగస్టు 6 హైదరాబాద్లో జరిగే ఈ మహాసభలో ప్రముఖ నాయకులు పాల్గొని ప్రసాద్ ఇస్తారని ఆయన తెలిపారు ఈ మహాసభకు మెదక్ అసెంబ్లీ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు టిఆర్ఎస్ అభిమానులు తరలించి ఈ సభను విజయవంతం చేయుటకు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఇప్పా రమేష్ , కసాపురం అశోక్ టౌన్ ఇన్‌చార్జ్ కేవల్ నందకుమార్ టీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు జునైద్ గారు,వీరస్వామి.దగడ్ శ్రీకాంత్. ఎల్లం నవీన్ భాను, ప్రేమ్, సయ్యద్ ఇమ్రోజ్, సోహైల్, రేహాన్, అర్సలాన్, మధు, తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News