పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 04: ఈనెల 6న, హైదరాబాద్ లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు మెదక్ టీఎన్జీవో భవన్లో వర్ధంతి సభ పోస్టర్ ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గద్దర్ ఫౌండేషన్ సభ్యులు బొమ్మల మైసయ్య. జెల్ల సుధాకర్. కాంగ్రెస్ నాయకులు గంగాధర్. సీనియర్ జర్నలిస్టు బొందుగుల నాగరాజు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ శంకర్ దయాల్ చారి. ఆకుల పెంటయ్య. దుర్గేష్ తదితరులు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన 60 ఏండ్ల జీవితాన్ని ప్రజలకు, ప్రజా యుద్ధానికి, పీడిత ప్రజల విముక్తి కోసం అంకితం చేసి, ప్రజలకు తన పాటను అంకితం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ భౌతికంగా దూరమై మూడేళ్లు గడుస్తున్నాయని చెప్పారు. ఆయన భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు, బోధించిన ఆకాంక్షలు, ఆయన పాట ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు.
ప్రజాయుద్ధ నౌక గద్దర్కు మరణం లేదని, ఆయన చూపించిన మార్గంలో అసమ సమాజాన్ని అంతం చేసే వరకు ప్రజల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మెదక్ జిల్లాకు గద్దర్ పేరును పెట్టాలని వారు డిమాండ్ చేశారు గద్దర్ ఆశయాలను కొనసాగించడం కోసం గద్దర్ కుమారుడు సూర్యం ఆధ్వర్యంలో గద్దర్ ఫౌండేషన్ ఏర్పడిందని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6న హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం 4 గంటలకు వర్ధంతి సభజరుగుతుందని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో స్టేడియం వద్ద జరుగు వర్ధంతి సభకు గద్దర్ అభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

















