[t4b-ticker]

ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కొరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ని కలిసిన రాజ్ గోపాల్ రెడ్డి

  • ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై చర్చించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
  • ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి హామీ ఇచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ.
  • వారం రోజుల్లో మునుగోడులోని ప్రభుత్వ ఆసుపత్రుల నివేదిక ఇవ్వాలని ఆదేశాలు .
  • రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రతి పక్షం మునుగోడు ఆగస్టు 04: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ సెంటర్లు పీహెచ్సీలు సిహెచ్సిలు ఏరియా ఆసుపత్రులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, సిబ్బంది, సాంకేతిక పరికరాలు, కావలసిన నిధులకు సంబంధించిన వివరాలతో పాటు చేయాల్సిన అభివృద్ధి పై ఈరోజు హైదరాబాదులోని సెక్రటేరియట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమావేశమయ్యారు .

ఈ సమావేశంలో మునుగోడు, నాంపల్లి, పిహెచ్సిల ఆధునీకరణతోపాటు 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం, మర్రిగూడ సిహెచ్సి ని 30 పడకల నుండి 50 పడకలకు పెంచడం సిబ్బంది నియామకం సాంకేతిక పరికరాల కల్పన పోస్టుమార్టం ఎగ్జామిన్ రూమ్,, చండూరు రెవిన్యూ కేంద్రంలో వంద పడకలతో ఏరియా ఆసుపత్రి మంజురు నిర్మాణం, గట్టుపల్ పిహెచ్సికి సిబ్బంది నియామకం సాంకేతిక పరికరాల కల్పన,,జాతీయ రహదారి 65 పై ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ హవర్లో హైదరాబాదు తీసుకెళ్లలేకపోతున్నారని ఈలోపే చాలామంది మరణిస్తున్నారని.. చౌటుప్పల్ ప్రాంతంలో అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు,, ట్రామా కేర్ సెంటర్ తో పాటు చౌటుప్పల్లో వంద పడకల ఏరియా ఆసుపత్రి ఆధునీకరణ సాంకేతిక పరికరాల కల్పన తో అభివృద్ధి చేయాలని కోరారు

ప్రస్తుతం గ్రామాలలో నిర్మించే ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల బడ్జెట్ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ధరలు, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సరిపోవడం లేదని సబ్ సెంటర్లతో పాటు పిహెచ్సిలు సిహెచ్సీ లు, ఏరియా ఆసుపత్రుల బడ్జెట్ పెంపు విషయం పై కూడా చర్చించారు.ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి చేయాలనీ చెప్పిన విషయాలన్నింటిని మంత్రి దామోదర రాజనర్సింహ గారు నోట్ చేసుకొని మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి హామీ ఇచ్చారు.వెంటనే వారం రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సంబంధించిన నివేదిక తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.చౌటుప్పల్ ఏరియా హాస్పిటల్ నిర్మాణ పనులను ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని, సెప్టెంబర్‌‌లో హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు…మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు.చౌటుప్పల్‌లో మదర్‌‌ అండ్ చైల్డ్‌ హెల్త్ సెంటర్,,ట్రామా కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గంలోని హాస్పిటళ్లు అన్నింటినీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గారి తో పాటు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవిందర్ నాయక్, నల్గొండ జిల్లా డీఎంహెచ్‌, డాక్టర్ రాహుల్,డి సి హెచ్ మాతృ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డి ఎం హెచ్ ఓ మనోహర్, డి సి హెచ్ సూర్య శ్రీ లు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News