ప్రతిపక్షం గుండాల ఆగస్ట్ 05: మహిళలను అడ్డుపెట్టుకొని కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల నాయకులు గడ్డం వీరన్న అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు పై అక్రమ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఒక మహిళను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తూ ఒక గిరిజన నాయకుడిపై తప్పుడు కేసులు బనాయించడం నీచ సంస్కృతి అని అన్నారు. భద్రాద్రి జిల్లాలో పినపాక నియోజకవర్గం లో రేగా కాంతారావు కు మరియు టిఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే తప్పుడు కేసులలో ఇరికించాలని చూసి అభ్యాస పాలవుతున్నారని అన్నారు.
మండల నాయకుల నుండి రాష్ట్ర నాయకుల వరకు రోజు ఏదో ఒక చోట తప్పుడు కేసులలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించాలని చూస్తున్నారని ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు కేసులలో ఇరికించే సంస్కృతిని మానుకోవాలని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని తెలుసుకొని పార్టీ నాయకులను కేసుల్లో ఇరికించడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతం పంపాలని దురుద్దేశం ఉందని అర్థమవుతుందన్నారు ఇప్పటికైనా ఇలాంటి పనులు చేసేవారు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్యాయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, అధికార ప్రతినిధి టి రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, ఎస్ టి సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ మాజీ సర్పంచ్ బుచ్చి రాములు, పార్టీ నాయకులు రాంబాబు, ప్రమోద్, రమేష్, కిరణ్, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

















