[t4b-ticker]

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దేశాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో అధికారిక పర్యటన చేపట్టేందుకు షరతులతో కూడిన అనుమతిని కోర్టు ఇచ్చింది.

పర్యటన ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి రావాలని, కోర్టు నిర్దేశించిన అన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు అనుమతితో సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

ఈ విదేశీ పర్యటనలో తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వివిధ దేశాల్లో జరిగే పెట్టుబడిదారుల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.

అదేవిధంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించనున్నారు. పలు ప్రముఖ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా మరియు శిక్షణ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించే దిశగా ఈ విదేశీ పర్యటన కీలకంగా మారనుందని ప్రభుత్వం పేర్కొంటోంది.

Spread the love

Related News

Latest News