[t4b-ticker]

భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది: షేక్ హసీనా

ప్రతిపక్షం, ఆగస్టు 06: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌ను తమ దేశానికి అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా అభివర్ణించారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ భారత్ బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. చారిత్రకంగా కూడా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మీడియాతో మాట్లాడిన హసీనా, “1971లో బంగ్లాదేశ్ విమోచన పోరాట సమయంలోనూ, 1975లోనూ భారత్ మాకు ఆశ్రయం కల్పించింది. మా దేశం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నా భారత్ అండగా నిలిచింది. భవిష్యత్తులో కూడా భారత్ గొప్ప మిత్రదేశంగానే ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.

అయితే, షేక్ హసీనాను మీడియాతో మాట్లాడేందుకు భారత్ అవకాశం కల్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య తమ దేశ సార్వభౌమత్వానికి విరుద్ధమని ఆరోపించింది. భారత భూభాగాన్ని ఉపయోగించి రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి అనుమతించడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బంగ్లాదేశ్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, హసీనా చేసిన వ్యాఖ్యలు భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై మరోసారి చర్చకు దారితీశాయి. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన పరిణామాలు ఎలా మారుతాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News