[t4b-ticker]

దమ్ముంటే ఆడియోలు, వీడియోలు బయటపెట్టండి.. సీఎంతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు: మహేశ్ కుమార్ గౌడ్

ప్రతిపక్షం, ఆగస్టు 06: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం పూర్తిస్థాయిలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని, పార్టీ పీసీసీ చీఫ్‌గా పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి, తన మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని చెప్పారు. నిన్న కూడా ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు.

ఇటీవల తనకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ఆధారాలు నిజంగా ఉంటే దమ్ముంటే వాటిని బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.

తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపైనే తాను దృష్టి సారిస్తున్నానని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News