ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 07: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జగద్గిరిగుట్ట దగ్గర బస్ డిపో నిర్మాణం కోసం కుత్బుల్లాపుర్ మండలం గాజుల రామారం దగ్గర 100 ఎకరాలు కేటాయించి నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభ లో ఎంపీలు చామల కిరణ్కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ పరిధి లోని జగద్గిరిగుట్ట మీదుగా 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు కలిపి రోజూ 404 ట్రిప్పుల వరకు తిరుగుతాయ న్నారు. టీజీఎస్ ఆర్టీసీ బస్ డిపో, టెర్మినల్ నిర్మాణం కోసం 99 ఏళ్లకు లీజుకు తీసుకోవడా నికి హెచ్ఎంటీకి చెందిన స్థలాన్ని గుర్తించిందన్నారు.కానీ హెచ్ఎంటీ అధికారులు.. అంత సుదీర్ఘకాలం స్థలాన్ని లీజుకు ఇవ్వలేమని, 5 ఏళ్లకోసారి చొప్పు న గరిష్ఠంగా 20 ఏళ్లకు మాత్రమే ఇస్తామని చెప్పార న్నారు. దీని కోసం ఏటా రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లిం చాలని చెప్పగా.. ఆ ప్రతిపాదనకు టీజీఎస్ఆర్టీసీ అంగీకరించలేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీకి గాజుల రామారం దగ్గర హెచ్ఎంటీ భూము లకు సమీపంలో 100 ఎకరాలు కేటాయిం చినట్లు కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. గాజుల రామారంలో ఏర్పాటు చేయబోయే డిపోలో ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసుల కోసం ప్రత్యేకంగా బస్ టెర్మినల్ ప్లాన్ చేశారు. సిటీ బస్సుల కోసం మరో టెర్మినల్, ఎలక్ర్టిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్కు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సు కారణంగా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రణాళికలు తయారు చేస్తున్నా రు. ఇతర రాష్ట్రాలు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఈ డిపోకు వెళ్లనున్నాయి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు.

















