59 ఎస్సీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న మహాధర్నా
“ఛలో హైదరాబాద్”
ప్రతిపక్షం, ఆగస్టు 08: భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించినా, నేటికీ దళితుల జీవితాల్లో సమానత్వం పూర్తిగా అమలు కాలేదు. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ ( MBSC) అనగా ఎస్సీలోని 57 కులాలు ఇంకా పేదరికం, నిరుద్యోగం, భూమిలేని జీవితం, విద్యా అవకాశాల కొరత, రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వంటి అనేక సమస్యలతో పోరాడుతున్నాయి.దశాబ్దాలుగా ప్రభుత్వాల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తున్నా, హామీలు తప్ప శాశ్వత పరిష్కారాలు కనిపించడం లేదని 59 ఎస్సీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో దళితుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఆగస్టు 8, 2026న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద “ఛలో హైదరాబాద్” పేరుతో భారీ ధర్నా నిర్వహిస్తున్నాం.
“మాకు దానం వద్దు… రాజ్యాంగం కల్పించిన హక్కులు కావాలి” అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము.
ఎస్సీ ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ సాధనకై మా డిమాండ్స్
- ఎస్సీ రిజర్వేషన్స్ 18 శాతానికి పెంచాలి.
- 1)మాల, 2)మాదిగ,3) 57 ఉపకులాలకు 3 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్ కు 750 కోట్లు కేటాయించాలి.
- అసైండ్ భూములకు సర్వ హక్కులు కల్పించి పూర్తి రక్షణ కల్పించాలి .
- 59 దళిత కులాలన్నిటికీ తహసీల్దార్ ద్వారానే కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చే విధంగా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి.
- ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే దళితులకు పొడుభూములపై సర్వహక్కులు కల్పించి అక్కడ ఎస్సీ రిజర్వేషన్స్ అమలు చేయాలి.
- ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలుపరిచి 12 లక్షలు ఇవ్వాలి .
- అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో దళితులకు 18 రిజర్వేషన్లు అమలుచేయాలి .
- ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లో దళితులకే మొదటి ప్రాధాన్యత నివ్వాలి.
- RTE -2009 చట్ట ప్రకారం అన్ని ప్రైవేట్, కార్పొరేట్ మెడికల్, ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో దళిత విద్యార్థులకు 25 % సీట్లు ఉచితంగా కేటాయించాలి .
- చట్ట సభలలో, ఇతర నామినేటెడ్ పదవుల్లో అత్యంత వెనుకబడిన 57 MBSC కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.
న్యాయమైన డిమాండ్లతో ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక దళిత కుటుంబాలు ఇంకా గుడిసెల్లోనే జీవిస్తున్నాయి. చదువుకోవాలనే తపన ఉన్నా అవకాశాలు అందడం లేదు. ఉద్యోగాల కోసం అర్హత ఉన్నా ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరుతున్నాయని చెప్పుకుంటున్న తరుణంలో అత్యంత వెనుకబడిన దళిత 57 MBSC కులాలు మాత్రం ఇంకా అభివృద్ధి అంచుల్లోనే నిలిచిపోయాయి అనడానికి మా మానసిక పరివర్తనే నిదర్శనం వెంటనే ప్రభుత్వం ఈ డిమాండ్లను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక న్యాయం కోణంలో మానవ దృక్పథంతో చూడాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, యువజనులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని దళితుల న్యాయమైన హక్కుల కోసం సంఘీభావం ప్రకటించాలని కోరుచున్నాము. గౌరవ పెద్దలు 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేష్ అన్నగారు మన దళిత కులాలకు అండగా ఉండడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి విజయవంతం చేయడం కోసం మొదటి నుండి మా కోసం శ్రమిస్తున్న గౌరవ పెద్దలు బైరి వెంకటేష్ అన్న గారికి ఉద్యమ జై భీము తెలుపుతూ.
“మా పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు… మా హక్కుల కోసం మాత్రమే. దళితుల కన్నీరు తుడవడం ప్రభుత్వాల బాధ్యత. ఈసారి మా స్వరం వినండి… మా న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయండి.”
రాయల లక్ష్మీ నరసయ్య 57 MBSC రాష్ట్ర ఉపాధ్యక్షులు
మరియు
తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు

















