[t4b-ticker]

రీల్స్ చూస్తోందని భార్యను చంపేశాడు.. బెంగళూరులో దారుణం

ప్రతిపక్షం, ఆగస్టు 08: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఇంటి పనులు చేయడం లేదనే కోపంతో ఓ భర్త తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బిహార్‌కు చెందిన ధీరజ్ కుమార్ (24), రీమా కుమారి (20) ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి జీవిస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న రీమా ఇంటి పనులు, వంట చేయకుండా ఎక్కువ సమయం రీల్స్ చూస్తోందని ధీరజ్ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య వివాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ధీరజ్ ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

రీమా స్నేహితులు ఆమెను చూసేందుకు ఇంటికి వెళ్లగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంట్లో పరిశీలించగా బెడ్‌లో దాచిన ఆమె మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ధీరజ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Spread the love

Related News

Latest News