[t4b-ticker]

UPI పేమెంట్లపై ఛార్జీలు.. ఎవరికి వర్తిస్తాయంటే?

ప్రతిపక్షం, ఆగస్టు 08: యూపీఐ పేమెంట్లపై ఛార్జీల విషయంలో వినియోగదారులకు కేంద్రం కీలక స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా డబ్బులు పంపే వ్యక్తికి, డబ్బులు స్వీకరించే వ్యక్తికి నేరుగా ఎలాంటి రుసుము విధించబోమని తెలిపింది.

అయితే లోక్‌సభలో ఆమోదం పొందిన చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్టానికి సంబంధించిన నిబంధనల ప్రకారం.. యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు తమ బ్యాంకులు లేదా చెల్లింపు సేవల సంస్థలకు రుసుము చెల్లించే అవకాశం ఉంటుంది. దీనినే వ్యాపారి తగ్గింపు రుసుముగా పిలుస్తారు.

ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థలకు చేసే యూపీఐ చెల్లింపులపై ఈ రుసుము విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఛార్జీలు సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం లేదా స్వీకరించడంపై నేరుగా పడవని కేంద్రం స్పష్టం చేస్తోంది.

Spread the love

Related News

Latest News