ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలో ఆగస్టు నెలను సంక్షేమ, అభివృద్ధి మాసంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీతో పాటు మరో 5 లక్షల మందికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
అదే రోజు హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (టిమ్స్) సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఇక హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కూడా ఆగస్టులో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక వసతులు, వైద్యం, విద్యుత్, పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడంతో ఈ నెల తెలంగాణకు కీలకంగా మారనుంది.





























