[t4b-ticker]

తెలంగాణలో ఎస్‌ఐఆర్‌.. రేపటితో గడువు ముగింపు

ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు రేపటితో గడువు ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

మరో 69 లక్షల మంది బూత్‌ స్థాయి అధికారుల నుంచి ఫారాలను తీసుకోలేదని, సుమారు 5 లక్షల మంది ఫారాలు తీసుకున్నప్పటికీ తిరిగి సమర్పించలేదని సమాచారం. దీంతో దాదాపు 74 లక్షల మంది ఓటర్ల వివరాలు పరిశీలనలోకి రాకపోతే వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఎన్యూమరేషన్ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారు రేపటిలోగా ఆన్‌లైన్‌లో ఓటర్ల సేవల పోర్టల్‌ ద్వారా వివరాలు సమర్పించవచ్చు. అలాగే సంబంధిత బూత్‌ స్థాయి అధికారిని సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం అందజేయాలని సూచించారు.

Spread the love

Related News

Latest News