ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లికి చెందిన చేర్యాల మాజీ ఎమ్మెల్యే గొర్ల సిద్ధయ్య (95) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో సిద్ధయ్య అందించిన సేవలను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, అనంతరం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.





























