హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: నిరుద్యోగులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. పలు పరిశ్రమలు, సంస్థల్లో వారికి అవసరమయ్యే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు అన్నింటిలో వారికి నైపుణ్యం పెంపొందించేందుకు సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. గత ఎన్నికల సమయంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం సైతం ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే!. ఇందులో భాగంగా శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలలో ఆధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్కిల్ సెంటర్లు ఏర్పాటుపై టీటీఎల్తో ఒప్పందం కుదిరింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL).ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్న టాటా టెక్నాలజీస్ 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సులను ప్రారంభిస్తోంది . 2024.-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.