ప్రతిపక్షం, వెబ్డెస్క్: పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత డిసెంబర్లో సైతం దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం సంచలనం రేపింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరుగనుంది.