ప్రతిపక్షం, కరీంనగర్, మే 3 : రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. దేశంలో రాహుల్ ప్రధాని కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధమవుతున్న మోడీని చిత్తుగా ఓడించాలని అన్నారు. బీజేపీకి 2/3 మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని హిందుత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్న బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కుట్ర లు గమనించే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారన్నారు. పదేళ్ల పాటు కాంగ్రెసే అధికారం ఉంటుందన్నారు. నేతకానీ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోడీ తెలంగాణకు ఇచ్చిందేం లేదు బండి కరీంనగర్కు తెచ్చింది ఏం లేదు అన్నారు.
గడిచిన 10 ఏళ్లలో నరేంద్ర మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా రాజారాంపల్లి, సిరిసిల్ల లో కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహించారు. ఆశేష జన వాహినిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లా డుతూ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సహా ఏ విభజన హామీ కూడా నెరవేర్చని అసమర్థ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మోడీ మాట్లాడారని, తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని అవహేళన చేసిన ఘనుడు మోడీ అంటూ విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం హిందుత్వాన్ని వ్యాపారం చేసుకుంటున్న నీచమైన పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు.
దేవుని బొమ్మ చూపించి ఓట్లు అడుక్కునే నీచ రాజకీ యాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అయోధ్యలో రాముని కళ్యాణం పూర్తి కాకముందే అక్షింతలు ఇంటి ఇంటికి పంపించి సంప్రదాయాలు మంటగలి పారని వ్యాఖ్యానించారు. మనమందరం రాముని భక్తులం కాదా..? మనం పండగలు చేసుకోవడం లేదా..? గ్రామ దేవతలకు కల్లు, కోడి కోయలేదా, మనకా హిందుత్వం గురించి రాముని గురించి బీజేపీ వాళ్ళు చెప్పేది అంటూ విమర్శించారు. రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్ చేసి రద్దు చేసేందుకు మోడీ సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి 2/3 మెజారిటీ ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. అందులో భాగంగానే 400 సీట్లు సాధించాలని మోడీ పదే పదే ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. బీజేపీ ప్రభు త్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేష న్లు రద్దు చేస్తారని నేను ఆరోపిస్తే నాపై కేసులు పెట్టి నోటీసులు పంపారు. కేసుల కు భయపడే వ్యక్తిని కాదు. ఆదర్శవంత మైన సమాజ నిర్మాణం కోసం ఎన్ని కేసు లు పెట్టినా భరిస్తానని పునరుద్ఘాటించా రు. బీజేపీ జనగణనను వద్దంటుంది. వద్దంటుంది. బీసీల రిజర్వేషన్ పెంచాలని బీసీ జన గణన చేపట్టి బహుజనులకు న్యాయం చేయాలని రాహుల్ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగా నే రాష్ట్రంలో బీసీ జన గణనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించిన మోడీని స్థానిక ఎంపీ బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. మోడీ తెలం గాణకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదు అందుకే బండికి ఓటేయాలా అంటూ ప్రశ్నించారు. ఆనాడు అర గుండు బండి ని పూర్తి గుండు అరవింద్‌ను ఓడించా రు.
తెలంగాణ ప్రజలు వివేకవంతంతో ఆలోచించి ఓటు వేయాలని సూచించా రు. బీజేపీని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొన సాగుతాయని అందుకోసం మీరందరూ కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాల్సిన సమ యం ఆసన్నమైందని అన్నారు. మనం గెలవాలంటే బీజేపీ ఓడాలి. అందుకోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులంతా సైని కుల్లా వీరోచితంగా పోరాడాలని సూచిం చారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాం టి మహనీయుల ఆశయాలను పునికి పు చ్చుకున్న వాళ్ళం అన్నారు. అందుకే ప్రజాస్వామ్యం పరిడవిల్లేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పలు పార్లమెంట్ స్థానా ల్లో బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్స్ అయ్యాయి అంటూ ఆరోపించారు. వాళ్ల గోడ మీద కాకి మా గోడ మీద వాలిన కల్లో చేరుతామని మ్మక్కు అర్థం కూటమిలోకి టూ లుగమనించే మద్దతు గాణలో తొలి నెల ఇచ్చి పేర్కొన్నారు ఆగస్టు చేస్తానని న్నల ప్రణాళికలు వివరించారు మైన జిల్లా లాంటి రు. తెలంగాణ సైతం న్న జరిగిన బుద్ధి చెప్పారు. ఓడించిన ఓడించి దేశాన్ని కోరారు. వెలిచాల పార్లమెంట్ అత్యధిక సీఎం కోరారు. శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే, లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు టాకూర్, వివేక్, రావు, మేడిపల్లి సత్యనారాయణ వంశీ, కరీంనగర్ రాజేందర్ రావు శ్రేణులు కార్యకర్తలు కాల్చిపడేస్తాం అన్నారు. రాబోయే ఎన్నికల్లో హంగ్ వస్తే తాము ప్రభుత్వంలో చెప్తున్నారు అంటే వారి రాజకీయాలు తెలంగాణ ప్రజలు చేసుకోవాలన్నారు. ఇండియా బీఆర్ఎస్‌ను రానీయమని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ కుట్ర కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇస్తున్నారని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు యువతకు బాసటగా నిలిచామని. రామప్ప శివుని సాక్షిగా 15లోగా రైతులకు రుణమాఫీ స్పష్టం చేశారు. తెలంగాణ రైత ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రూపొందించుకున్నానని.. కరీంనగర్ చైతన్యవంత చొక్కారావు, ఎమ్మెస్సార్ ఉద్దండులైన వారిని గెలిపించా ఆకాంక్ష కోసం కేసీఆర్‌ను గెలిపించారు. అదే కేసీఆర్‌ను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి సెమీ ఫైనల్లో కేసీఆర్‌ను మీరు ఫైనల్ లో మోడీని సురక్షితంగా ఉంచాలని కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి రాజేందర్ రావు, పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీ లను భారీ మెజారిటీ తో గెలిపించాలని తెలిపారు. ఈ సభలలో మంత్రి దుద్దిల్ల మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి, విప్ అది శ్రీనివాస్, విజయరామణా రావ్, రాజ్ వినోద్, ప్రేమ్ సాగర్ సత్యం, కవ్వంపల్లి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వెలిచాల లతో పాటు కాంగ్రెస్ పాల్గొన్నారు.