ప్రతిపక్షం, గజ్వేల్, జూన్ 29: తలకోక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రోజున కుకునూరుపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150మందికి విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ తలకోక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నైపుణ్యం, చేయూత నిచ్చేందుకు ఇట్టి కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బచ్చలి సత్తయ్య, తాజా మాజీ సర్పంచ్ పోల్కంపల్లి జయంతి, నరేందర్, ట్రస్ట్ కోశాధికారి దుర్గాప్రసాద్, కార్యదర్శి మధుసూదన్, ఐటీ నిపుణులు రాజ్ కిరణ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.