మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే శంకర్ వినతి
ప్రతిపక్షం, వెబ్డెస్క్: పౌల్ట్రీ రైతులపై విధించిన ప్రాపర్టీ టాక్స్ (ఆస్తి పన్ను) మినహాయింపు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఎమ్మెల్యే శంకర్ కలిశారు. పాత బకాయిల వసూలు గురించి, షాద్ నగర్ మున్సిపాలిటీ పౌల్ట్రీ రైతులకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ మంత్రికి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని అనుసరిస్తూ పాతబాకిలను పూర్తిగా రద్దు చేయమని కోరానని తెలిపారు.