Harish Rao Serious about Minister Ponnam Prabhakar: కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాళం వేసితిని .. గొళ్ళెం మరచితిని’ అన్నట్లు మీరు అన్ని ప్రాజెక్టులను అప్పగించినట్లు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా నిరుపయోగంగా మాకు అప్పగించితే దాన్ని రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురైన ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే అనే వాస్తవాన్ని మంత్రి పొన్నం గుర్తించకపోయినా కరీంనగర్ రైతులకు తెలుసన్నారు. అబద్ధాలు చెప్పి శాసన సభ్యులను తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాల్సి వస్తుందన్నారు.