మెదక్, ప్రతిపక్షం, జూన్ 03: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వరుదురుగా మాత ఆలయంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వన దుర్గ మాత ఆలయంలో హరీష్ రావు పేరు మీద ప్రత్యేక పూజ కార్యక్రమాలు అర్చన నిర్వహించారు. అనంతరం రాజగోపురం వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ బర్త్డే కేక్ ను తినిపించుకున్నారు ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు పేద ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని వనదుర్గా మాత సాక్షిగా పేద ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏడుపాయల కమిటీ చైర్మన్ బాలగౌడ్. నవీన్. రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు సోములు పాపన్నపేట మండల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.




















