ప్రతిపక్షం, ఆగస్టు 08: వన్డే క్రికెట్ చరిత్ర 5,000 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ ఫార్మాట్‌లో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న పలు అరుదైన రికార్డులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: రోహిత్ శర్మ – 264 పరుగులు
- అత్యధిక ద్విశతకాలు: రోహిత్ శర్మ – 3
- అత్యధిక సెంచరీలు: విరాట్ కోహ్లీ – 54
- అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ – 18,426
- అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: చమిందా వాస్ – 8/19
- అత్యధిక వికెట్లు: ముత్తయ్య మురళీధరన్ – 534
- అత్యధిక జట్టు స్కోరు: ఇంగ్లండ్ – 498/4
- అత్యల్ప జట్టు స్కోరు: జింబాబ్వే – 35 పరుగులు
దశాబ్దాలు గడుస్తున్నా ఈ రికార్డుల్లో చాలా వరకు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్ 264 పరుగుల ఇన్నింగ్స్, సచిన్ భారీ పరుగుల రికార్డు, మురళీధరన్ వికెట్ల ఘనత వన్డే క్రికెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
మరి వన్డే క్రికెట్‌లో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే బెస్ట్ మూమెంట్ ఏది?





























