ప్రతిపక్షం, ఆగస్టు 08: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన డిమాండ్‌తో ఈ అంశంపై చర్చ మొదలైంది. దీనిపై నెటిజన్లు తమకు నచ్చిన నేతలు, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను సూచిస్తున్నారు.
సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ వంటి ప్రముఖుల చిత్రాలను నోట్లపై ముద్రించాలని కొందరు కోరుతున్నారు. మరికొందరు దేవుళ్ల చిత్రాలు ఉండాలని అభిప్రాయపడుతుండగా.. ఇంకొందరు కరెన్సీ నోట్లపై ఏ వ్యక్తి ఫొటో కూడా అవసరం లేదని చెబుతున్నారు.
మరి కరెన్సీ నోట్లపై ఎవరి ఫొటో ఉండాలి? లేక అసలు ఫొటోలే ఉండకూడదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.





























