ప్రతిపక్షం, ఆగస్టు 08: హైదరాబాద్ బాలానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తపై అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లాకు చెందిన డొమ్మాట నవనీత (28) శనివారం ఉదయం తన ఏడు నెలల కుమారుడిని అత్త వద్ద ఉంచి మరో గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నవనీత భర్తకు మద్యం అలవాటు ఉందని, మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నవనీత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. ఏడునెలల చిన్నారిని తల్లి లేకుండా చేయడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.





























