ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్డేట్ చేసుకునేందుకు UIDAI వెబ్సైట్లో ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.