Trending Now

క్లిష్ట పరిస్థితుల్లో దేశం..

పదేండ్లలో దేశానికి బీజేపీ అన్యాయం

కాంగ్రెస్​ పార్టీని ఆశీర్వదించండీ..

ఏఐసీసీ ఎక్స్​సర్వీస్​మెన్​ వింగ్​ కల్నల్​ హరీశ్​ చౌదరి

ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో, హైదరాబాద్​: దేశంలో ఇప్పుడు క్లిష్ట పరిస్థితి లో ఉంది. పదేండ్ల బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ ఆధానీ, అంబానీ లకు దోచి పెట్టడం తప్ప ఏమీ చెయ్యలేదని ఏఐసీసీ ఎక్స్​సర్వీస్​మెన్​ వింగ్​ కన్వీనర్​ కల్నల్​ హరీశ్​ చౌదరి ఆరోపించారు. గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు, బలహీన వర్గాల వారి కి మద్దతుగా ఉందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ యాత్ర చేశాడని, ఈ యాత్రంలో దేశ వ్యాప్తంగా ప్రజలు పడే బాధలతో పాటు వివిధ రాష్ట్రాల సమస్యలను సైతం తెలుసుకొన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కి ఓటమి తప్పదని, బీజేపీని ప్రజలు ఇంటికి పంపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని తెలిపారు.

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల పట్ల మోడీకి చిన్న చూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. వన్ నేషన్, వన్ పెన్షన్ ఇస్తా నని ఆర్మీని మోసం చేసిండని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం అగ్ని పథ్ పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేపడుతోంది. అగ్నివీర్ కాంట్రాక్టు సైనికులను రెగ్యులర్ చేయట్లేదు. దీనితో సైనికులు అన్ని బెనిఫిట్స్ కోల్పోతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రవేట్ ఉద్యోగాలను కాకుండా పర్మినెంట్ ఉద్యోగాలు చేపడతామని చెప్పారన్నారు. మోడీ, ఎన్డీయే ప్రభుత్వం ఏజెండా వేరెలా ఉందని, యువతకు ఉద్యోగాల విషయంలో మోడీ మోసం చేసిండని ఆరోపించారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు ఉన్నవని, వాటిలో ఆర్మీకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నట్లు తెలిపారు. దేశం సురక్షంగా ఉండాలంటే ఈనెల 13వ తేదీన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

Spread the love

Related News

Latest News