Mahesh Kumar Goud Fires To BJP&BRS: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఆ రెండు పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అధిష్ఠానం కోరుకున్నట్లుగా నడచుకుంటానని, ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకు ధీటుగా కుల గణన జరగాలన్నారు. దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని భారత్ జోడో నుంచి చాటుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు.