Trending Now

దేశం మార్పు కోరుకుంటుంది..

దేశ భవిష్యత్తు కొరకు ఆత్రం సుగుణ కు ఓటు వేయండి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 7 : నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి మంగళవారం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి, సముందర్ పల్లి, టెంబర్ని గ్రామాలలో గ్రామస్తులను కలిసి చేతు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి ఉపాధి హామీ పనుల వద్ద ప్రచారం నిర్వహించారు. ఆప్యాయంగా పలకరిస్తూ దేశం మార్పు కోరుకుంటుందని దేశ భవిష్యత్తు కొరకు అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంబరి గంగాధర్, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సేల్స్ జిల్లా అధ్యక్షుడు బాణావత్ గోవింద్ నాయక్, నిర్మల్ జిల్లా కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతారెడ్డి ,ఎస్టీ సెల్ సారంగాపూర్ మండల అధ్యక్షుడు భీమ రావు, నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త సత్యనారాయణ, కౌట్ల గంగాధర్ ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News