Trending Now

Telangana Police: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

Telangana Police busts cyber crime racket: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝులిపించారు. ఈ మేరకు నేరాలకు పాల్పడిన 27మంది సైబర్ నేరగాళ్లను రాజస్థాన్ గడ్డపై తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల నుంచి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు వారి దగ్గర భారీగా లభ్యమైన బ్యాంక్ చెక్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీడియాకు వివరించనున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News