ప్రతిపక్షం, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసానిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు బాలుడు మృతి చెందారు. నాందేడ్ అఖోలా 161వ జాతీయ రహదారిపై కుటుంబం బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ను బలంగా ఢీకొన్నారు. ఈ ఘటనలో దంపతులతో పాటు బాలుడు మృతిచెందారు. మృతులు మద్నూర్ మండలం పెద్ద తాడ్కూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35), సునీత (30), నాగేశ్ (07)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.